: కోర్టు విచారణకు జీన్స్ లో వచ్చిన మహిళా ఇంజనీర్... డ్రెస్ కోడ్ కి ఆదేశించిన న్యాయమూర్తులు!

హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు ఓ కేసు విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఇంజనీర్ ఒకరు జీన్స్ పాంట్, భిన్న రంగుల గళ్ల చొక్కాతో మోడర్న్ లుక్ తో వచ్చారు. ఆమెను చూసిన న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘కక్షిదారులు కోర్టు ముందు హాజరయ్యే సమయంలో మర్యాదపూర్వకంగా, నిరాడంబర రీతిలో ఉండాలని ఆశిస్తున్నాం. సరైన వస్త్రధారణ ఉద్దేశం తీవ్రతను తెలియజేస్తుంది. న్యాయం విషయంలో ఇది చాలా అవసరం’’ అని జస్టిస్ తర్లోక్ సింగ్ చౌహాన్, జస్టిస్ అజయ్ మోహన్ తో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది.

ప్రభుత్వ అధికారులు కోర్టు విచారణలకు హాజరయ్యే సమయంలో విధిగా డ్రెస్ కోడ్ ను నిర్దేశిస్తూ సూచనలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టు ఆదేశించింది. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించింది.

More Telugu News