dhanush: నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు: ధనుష్

కోలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో ధనుష్ పేరు కూడా ఉంటుంది. ఆయన తాజా చిత్రంగా 'విఐపి 2' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల టీవీ 9 కి ధనుష్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సమయంలోనే ఆయన వ్యక్తిగత విషయాలకి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. సమాధానం చెప్పడం ఇష్టం లేని ధనుష్ .. అసహనాన్ని వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి విసురుగా లేచి వెళ్లిపోయాడు.

ఆ రోజున అలా చేసినందుకు ఆయన ఇప్పుడు విచారాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఆ రోజున తాను అలా చేయడం తనకి ఇప్పుడు  చాలా సిల్లీగా అనిపిస్తోందని, అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని చెప్పాడు. ఒక వైపున షూటింగ్స్ .. మరో వైపున ప్రమోషన్స్ కారణంగా రెండు వారాలుగా తనకి నిద్రలేదని అన్నాడు. ఆ ఒత్తిడితోనే ఇంటర్వ్యూకి వచ్చానని చెప్పాడు. తాను అలా రియాక్ట్ కావడానికి ఒత్తిడి కారణం కావొచ్చని .. నిజానికి తాను చాలా కామ్ పర్సన్ అని చెప్పుకొచ్చాడు.

More Telugu News