: లాయర్ తో కలిసి సిట్ కార్యాలయానికి చేరుకున్న సుబ్బరాజు

డ్రగ్స్ వినియోగంపై మూడో రోజు విచారణ ఎదుర్కోనున్న సినీ ప్రముఖుడు సుబ్బరాజు నిర్ణీత సమయానికి 10 నిమిషాల ముందుగానే చేరుకున్నాడు. లాయర్, మరొక సన్నిహితుడితో కలిసి సుబ్బరాజు ఇన్నోవా కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు. సుబ్బరాజును ప్రశ్నించేందుకు సిట్ అధికారులు ప్రశ్నావళిని సిద్ధం చేశారు. ఇప్పటికే పోలీసుల దగ్గర ఆధారాలు సిద్ధంగా ఉండడంతో సుబ్బరాజు ఎలాంటి సహకారమందిస్తారన్న విషయంపై ఆసక్తి రేగుతోంది. 

More Telugu News