varun tej: 'ఫిదా' చేస్తోన్న థియేట్రికల్ ట్రైలర్!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫిదా' సినిమా .. ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. సెంటిమెంట్ .. ఎమోషన్ కి సంబంధించిన సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకునేదిలా వుంది.

ప్రేమ అనేది ఎడబాటును ఎంత మాత్రం తట్టుకోలేదనే విషయాన్ని ఈ ట్రైలర్ ద్వారా ఆవిష్కరించారు. సంగీతం .. ఫోటోగ్రఫీ .. శేఖర్ కమ్ముల ఫీల్ కి మరింత బలాన్నిచ్చాయి. యూత్ కి ఈ సినిమా బాగానే కనెక్ట్ అవుతుందనిపిస్తోంది. ఈ ట్రైలర్ తో అంచనాలు పెంచడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా హిట్ ను సొంతం చేసుకోవడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.  

 

More Telugu News