nani: విజయవాడలో ఘనంగా 'నిన్నుకోరి' సెలబ్రేషన్స్

నాని - నివేదా థామస్ జంటగా రూపొందిన 'నిన్నుకోరి' సినిమా, విడుదలైన ప్రతి చోటున విజయవిహారం చేస్తూ వెళుతోంది. భారీ ఓపెనింగ్స్ తో పాటు భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. నాని ఖాతాలో మరో హిట్ ను జమ చేసిన ఈ సినిమా, నివేదా థామస్ కెరియర్ స్పీడ్ కూడా పెంచేసింది. దర్శకుడు శివ నిర్వాణకు తొలి ప్రయత్నంలోనే ఘన విజయాన్ని అందించింది.

 ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ విజయవాడలో 'నిన్నుకోరి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్' ను నిర్వహించడానికి ప్లాన్ చేసింది. విజయవాడ - బందరు రోడ్డులోని ఎ 1 కన్వెన్షన్ సెంటర్లో,  ఈ నెల 16వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకను వైభవంగా జరపనున్నారు. నాని .. నివేదా థామస్ .. ఆది పినిశెట్టి .. దర్శక నిర్మాతలు .. ఇతర సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.   

More Telugu News