: ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం... రెడీగా ఉన్నామన్న నేవీ చీఫ్ లాంబా!

కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఎటువంటి నిర్ణయాన్నైనా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా వ్యాఖ్యానించారు. పుణేలోని జాతీయ రక్షణ అకాడమీ(ఎన్‌డీఏ) గ్రాడ్యుయేట్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఇండియన్ నేవీ సముద్ర జలాల్లో విస్తరిస్తోందని, ఏ వైపు నుంచి అత్యవసర పరిస్థితి ఎదురైనా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఇప్పటికే గల్ఫ్ ఆఫ్ అడెన్ లో ఓ యుద్ధ నౌకను శాశ్వతంగా మోహరించామని, పశ్చిమ నేవీ కమాండ్ నౌక ఒకటి మధ్యదరా సముద్రం గుండా అట్లాంటిక్ కు చేరుకుందని అన్నారు. ముంబైపై జరిగిన 26-11 వంటి దాడి ఘటన సంభవించినా ఎదుర్కోగలమని తెలిపారు. భారత నౌకలు సింగపూర్ తో కలసి విన్యాసాలు పూర్తి చేసుకుని, ఆస్ట్రేలియాతో కలిసేందుకు బయలుదేరాయని అన్నారు. 2003కు పైగా నౌకలు ప్రస్తుతం సేవలందిస్తున్నాయని అన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 312 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని వెల్లడించారు.

More Telugu News