: వై గన్స్ అండ్ థైస్?: వర్మ చెప్పిన వివరణ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ఫాలోవర్స్ కు ఉల్లాసాన్నిచ్చే అప్రియమైన సర్ ప్రైజ్ అంటూ ‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను నిన్న సాయంత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్ ను తీయడానికి గల కారణాలను చెబుతూ వర్మ తాజా ట్వీట్ చేశారు. ‘డిజిటల్ వరల్డ్ లోకి నేను ప్రవేశించడానికి గల నా ఏకైక లక్ష్యం ఫిల్మ్ స్క్రీన్ పై అనుమతించని కథలను దీని ద్వారా చెప్పాలన్నదే. ఈ ప్లాట్ ఫామ్ లో నా ఫస్టు ప్రొడక్ట్ ‘గన్స్ అండ్ థైస్’. ఈ సిరీస్ లో మొత్తం నాలుగు సీజన్లలో మొదటి సీజన్ లో భాగంగా పది ఎపిసోడ్స్ ఉంటాయి. లక్ష్యం, అహం, అత్యాశలతో కూడిన అంతర్గత రాజకీయాలపై అధికారం, సెక్స్ ఏ విధంగా ఉంటాయన్న దానికి పర్యాయపదం గన్స్ అండ్ థైస్. పోలీసులను, అండర్ వరల్డ్ కు చెందిన మధ్యవర్తులను హతమార్చిన మాజీ గ్యాంగ్ స్టర్స్ తో నాకు కొన్నేళ్లుగా ఉన్న విస్తృత పరిచయాలే ఈ సిరీస్ కు సంబంధించిన కథకు ఆధారం..’ అంటూ వర్మ పేర్కొన్నారు.

More Telugu News