: ఐటీ ఉద్యోగుల్లో రోజురోజుకూ పెరుగుతున్న కలవరం

నిన్న మొన్నటిదాకా లగ్జరీ జీవితాన్ని అనుభవించిన ఐటీ ఉద్యోగులకు ఇప్పుడు కంటిమీద కునుకు పడటం లేదు. వారిలోని ఆందోళన నానాటికీ పెరుగుతోంది. దీనికంతా కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే. 'అమెరికా ఉద్యోగాలన్నీ అమెరికన్లకే' అంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ ఐటీ రంగంపై పడింది. ఈ నేపథ్యంలో వీలైనంత మంది ఉద్యోగులను తొలగించుకోవడానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ లెవెల్ ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం ఉంది. కాగ్నిజెంట్ లాంటి పెద్ద కంపెనీలు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుండటం ఐటీ నిపుణుల్లో కలవరం రేపుతోంది. ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు క్యాబ్ సేవలను ఆపేశాయి. ప్రాజెక్టులు రావడం లేదని కూడా కొన్ని కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు ఆటోమేషన్ కూడా ఐటీ ఉద్యోగులకు సవాల్ విసురుతోంది. నైపుణ్యాలను పెంచుకోలేని ఉద్యోగులకు గడ్డుకాలం ఎదురుకానుంది. 

More Telugu News