: టాటాలకు షాక్.. స్టార్ హోటల్ ను వేలం వేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పు

టాటాలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. టాటా గ్రూపుకు చెందిన ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ 'తాజ్ మాన్ సింగ్'ను వేలం వేయాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది. ఈ హోటల్ ను ఆన్ లైన్ లో (ఈ-వేలం) వేలం వేయడానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు సుప్రీం అనుమతి ఇచ్చింది. ఈ హోటల్ ను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్థలంలో నిర్మించారు. 33 ఏళ్ల ఒప్పందంతో టాటాలకు ఈ భూమిని కార్పొరేషన్ లీజుకు ఇచ్చింది. 2011లో ఈ లీజు ఒప్పందం పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా తొమ్మిది సార్లు లీజు గడువును కార్పొరేషన్ పొడిగించింది. అద్దె విషయంలో విభేదాలు తలెత్తడంతో ఈ హోటల్ ను వేలం వేయడానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, కార్పొరేషన్ నిర్ణయాన్ని టాటా గ్రూపు వ్యతిరేకించింది. దీంతో, ఢిల్లీ కార్పొరేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం హోటల్ ను వేలం వేయడానికి ఢిల్లీ కార్పొరేషన్ కు అనుమతినిచ్చింది. ఈ వేలాన్ని టాటా గ్రూపు దక్కించుకోలేకపోతే.... హోటల్ ను ఖాళీ చేసేందుకు వారికి ఆరు నెలల గడువు ఇవ్వాలని సూచించింది.

More Telugu News