: అద్భుతమైన క్యాచ్ పట్టినా ఔట్ కాని ఊతప్ప...ఆకట్టుకున్న కోల్ కతా

అద్భుతమైన ఆటతీరుతో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మన్, సన్ రైజర్స్ హైదరాబాదు బౌలర్లు కలసి అభిమానులకు పసందైన క్రికెట్ విందును అందిస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతాకు సునీల్ నరైన్ (6), కెప్టెన్ గంభీర్ (15) వికెట్లను తీసి సన్ రైజర్స్ ఆకట్టుకుంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాబిన్ ఊతప్ప (68) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా, మనీష్ పాండే (20) జాగ్రత్తగా ఆడుతున్నాడు. 13వ ఓవర్ 2వ బంతిని ఆశిష్ నెహ్రా లెగ్ వికెట్ పై సంధించాడు. దానిని బౌండరీగా మలచాలని ఊతప్ప ప్రయత్నించాడు. అయితే గాల్లోకి లేచిన బంతి అతనికి కొంచెం దూరంలో పడింది.

దానిని దూరంగా కీపింగ్ చేస్తున్న నమన్ ఓజా అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించగా, లెగ్ అంపైర్ అవుట్ అని చెప్పడంతో థర్డ్ అంపైర్ కు విన్నవించారు. బంతి నేలను తాకకముందే క్యాచ్ పట్టాడని తేలడంతో స్టేడియంలో అంతా ఊతప్ప అవుట్ అని భావించారు. అయితే రీ ప్లేను మళ్లీ మళ్లీ చూడడంతో బంతి బ్యాట్ ను తాకలేదని, థై ను తాకి గాల్లోకి లేచిందని తేలింది. దీంతో నాటౌట్ గా తేలింది. ఆ తరువాతి రెండు బంతులను బౌండరీలుగా బాది దూకుడు ప్రదర్శించాడు. అనంతరం కట్టింగ్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి రషీద్ పట్టడంతో 117 పరుగుల వద్ద ఊతప్ప పెవిలియన్ చేరాడు. దీంతో 15 ఓవర్లలో కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు మూడు వికెట్ల నష్టానికి 124 పరుగుల చేశారు. 

More Telugu News