: ఎవరెస్టు ఎక్కి రికార్డు నెలకొల్పేందుకు సన్నద్ధమవుతున్న 85 ఏళ్ల వ్యక్తి

85  ఏళ్ల వయసులో ఎవరెస్టు శిఖరం ఎక్కేందుకు నేపాల్ కు చెందిన మిన్ బహదూర్ షెర్ చాన్ సిద్ధమవుతున్నాడు. గతంలో ఎవరెస్టు శిఖరం ఎక్కిన అతి పెద్ద వయస్కుడి రికార్డును మిన్ బహదూర్ షెర్ చాన్ తన పేరిట లిఖించుకున్నాడు. అయితే 2013 లో జపాన్ ‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు ఎవరెస్టు శిఖరం అధిరోహించి అంతకు ముందు బహదూర్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. దీంతో ఎవరెస్టు శిఖరం అధిరోహించిన అతిపెద్ద వయస్కుడి రికార్డు తన పేరిటే ఉండాలని భావించిన మిన్ బహదూర్ షెర్ చాన్...వచ్చే నెల ఎవరెస్టు శిఖరం అధిరోహించడం ద్వారా, ఆ శిఖరాన్ని అధిరోహించిన అతి పెద్ద వయస్కుడిగా తన పేరిట ఆ ప్రపంచ రికార్డును నెలకొల్పాలని భావిస్తున్నారు. 

More Telugu News