: అవి ఫిరాయింపులు కావా?.. వాటినేమంటారు?: జగన్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న

అణు ఒప్పందం సమయంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ఫిరాయింపులను ప్రోత్సహించిందని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వీటిని దగ్గరుండి మరీ ప్రోత్సహించారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ఉదయం జరిగిన టీడీపీ సమన్వయ భేటీలో జగన్ ఢిల్లీ వెళ్లిన విషయం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై స్పందించిన బాబు టీడీపీ ఎంపీలు ఆదికేశవులు నాయుడు, మందా జగన్నాథాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లి అణు ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేయించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఆ తర్వాత ఆదికేశవులుకి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. వారెవరూ తమ పదవులకు రాజీనామా చేయలేదని, అవి పిరాయింపులు కావా? అని జగన్‌ను ప్రశ్నించారు. వైఎస్సార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక టీడీపీ ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వై.బాలనాగిరెడ్డిలను కాంగ్రెస్‌లోకి తీసుకున్నారని, వారు కూడా తమ పదవులకు రాజీనామా చేయలేదని అన్నారు. మరి అప్పుడెందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

More Telugu News