: వందరెట్ల వేగంతో వస్తున్న వైఫై.. సెకనుకు 40 జీబీ డేటా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు!

వేగం లేని వైఫైతో విసిగిపోతున్నారా? డోంట్ వర్రీ.. ప్రస్తుత వైఫై వేగానికి వందరెట్ల వేగంతో పనిచేసే సరికొత్త వైఫై వచ్చేస్తోంది. తాజాగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ వైఫై ద్వారా సెకనుకు 40 జీబీల డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్ని డివైజ్‌‌లకు వైఫ్ కనెక్టి చేసి వాడుకున్నా దాని వేగం ఏమాత్రం తగ్గదు. ఒక్కో డివైజ్‌కు ఒక్కో పరారుణ కాంతికిరణం అనుసంధానం అవడం వల్ల వైఫైని ఎన్ని పరికరాలకు కనెక్ట్ చేసుకున్నా వేగంలో మార్పు రాదు. నెదర్లాండ్స్‌లోని ఇండ్హోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ నూతన వైఫైని అభివృద్ధి చేశారు. ఇందుకోసం ఎటువంటి ప్రమాదం లేని పరారుణ కిరణాలను ఉపయోగించారు. దీనివల్ల ప్రస్తుత వైఫై కంటే ఎక్కువ పరికరాలను అనుసంధానం చేసుకుని ఉపయోగించుకునే వీలుంటుందని వారు పేర్కొన్నారు. ఎన్ని పరికరాలను కనెక్ట్ చేసుకున్నా వేగంలో మాత్రం మార్పు రాదని వివరించారు.

More Telugu News