: ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న టీడీపీ

తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి మరో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు వచ్చి చేరాయి. అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాస్తవానికి సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. స్వతంత్ర  అభ్యర్థులంతా నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టీడీపీ అభ్యర్థులు ఎన్నికైనట్టు చెప్పవచ్చు. వీరి ఎన్నికను సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు.

అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి మేనల్లుడు అయిన దీపక్ రెడ్డి విషయంలో ఈ మధ్యాహ్నం వరకు టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే, స్వతంత్ర అభ్యర్థి పైలా నర్సింహయ్య తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో దీపక్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో శత్రుచర్ల విజయరామరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో మంతెన సత్యనారాయణరాజు, అంగర రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో చిక్కాల రామచంద్రరావు, చిత్తూరు జిల్లాలో దొరబాబులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

More Telugu News