: 39 సిక్సర్లు, 14 ఫోర్లతో ట్రిపుల్ సెంచరీ చేసి టీ20 మజా చూపిన ఢిల్లీ యువకుడు

టీ20 మజాయే వేరు. టీ20 వెలుగులోకి వచ్చిన తరువాత టెస్టు, వన్డేలు పూర్తిగా వెనుకబడిపోయాయి. తమిళనాడులో జిల్లాల ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ శ్రీనివాసన్ నిర్వహించిన టీ20 టోర్నీ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో బంతి ఎలా వచ్చినా బౌండరీ లక్ష్యంగా బాదిన ఢిల్లీ యువ ఆటగాడు క్రికెట్ చరిత్రలో అద్భుతాన్ని సాధించాడు. టీ20లో ఒక ఆటగాడు డబుల్ సెంచరీ సాధించడం అంటేనే అద్భుతం. అలాంటది 21 ఏళ్ల యువకుడు క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుతమనదగ్గ ట్రిపుల్ సెంచరీని సాధించాడు.

ప్రపంచంలోని ఏ వయసు టీ20లోనైనా ఇంతవరకు ట్రిపుల్ సెంచరీ నమోదు కాలేదు. తొలిసారిగా అనధికార మ్యాచ్ లో వికెట్ కీపర్ మోహిత్ అల్హావత్ కేవలం 72 బంతుల్లో 39 సిక్సర్లు, 14 ఫోర్లతో పరుగుల మోత మోగించి అపూర్వమైన రికార్డు సృష్టించాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌ లో క్రిస్ గేల్ 66 బంతుల‌్లో 175 పరుగులు సాధించడమే ఇప్పటి వరకు అత్యధికం. ఢిల్లీలోని లోకల్ మ్యాచ్ లో  అద్భుతాన్ని సాధించాడు. 

More Telugu News