: కోర్టు అడ్డుకున్నా వినని అధికారులు... ట్రంప్ వ్యతిరేక నిరసనల వెల్లువ

సరైన పత్రాలతో అమెరికాకు వచ్చే ముస్లింలను అడ్డుకోవద్దని యూఎస్ ఫెడరల్ కోర్టు ఆదేశాలు జారీ చేసినా, వాటిని పెడచెవిన పెట్టిన అధికారులు, విమానాశ్రయాల్లోనే ముస్లింలను అడ్డుకుని వెనక్కు పంపుతున్నారు. డల్లాస్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో తదితర అంతర్జాతీయ ఎయిర్ పోర్టుల్లో పదుల సంఖ్యలో ముస్లింలను బయటకు రాకుండా నిలువరించారు. పలు చోట్ల వెనక్కు తిరిగి వెళ్లేందుకు అంగీకరించని వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ట్రంప్ తాజా ఆదేశాలను నిరసిస్తూ, పలు విమానాశ్రయాల ఎదుట పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అమెరికన్లు స్వచ్ఛందంగా వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రజల మధ్య గోడలు కట్టడం సరికాదని, ట్రంప్ దూకుడు వైఖరిని ప్రదర్శించరాదని, వెంటనే తన ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News