: ఆ గూడ్స్ రైలు లేకుంటే 200 మంది మరణించేవారు!

విజయనగరం జిల్లాలో గత రాత్రి జగదల్ పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో పక్కనే ఉన్న ట్రాక్ పై గూడ్స్ రైలు ఆగి ఉండటం, కనీసం 150 మంది ప్రాణాలను కాపాడింది. ఘటన జరిగిన సమయంలో రైలు 40 కిలోమీటర్ల కన్నా తక్కువ వేగంతోనే ప్రయాణిస్తోంది. ఇంజన్ సహా 9 బోగీలు పట్టాలు తప్పగా, వీటిల్లో ఐదు బోగీలు పక్కనే ఉన్న గూడ్స్ రైలును ఢీకొని నిలిచిపోయాయి. అక్కడే గూడ్స్ లేకుంటే, ఈ బోగీలన్నీ పక్కకు బోల్తా పడేవి. రైలు బోగీలు పక్కకు దొర్లకుండా గూడ్స్ అడ్డుగా నిలిచిందని అధికారులు వెల్లడించారు. ఈ రైలు లేకుంటే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదని తెలిపారు. కాగా, ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 33కు పెరిగింది.

More Telugu News