demonitisation: ఢిల్లీలో మరో బ్యాంకులో భారీగా నగదు డిపాజిట్‌ అయినట్లు గుర్తించిన అధికారులు!

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో విస్తృతంగా దాడులు జరుపుతున్న అధికారులు ఇప్ప‌టికే ప‌లు బ్యాంకుల్లో సోదాలు నిర్వ‌హించి ప‌లువురు బ్యాంకర్ల‌పై చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ రోజు మరో బ్యాంకులో నిర్వ‌హిస్తోన్న‌ దాడుల్లో భారీగా డ‌బ్బు జ‌మ అయిన‌ట్లు గుర్తించారు. ఢిల్లీలోని జైన్‌ కో-ఆపరేటీవ్‌ బ్యాంకులోని లావాదేవీలపై ఆ రాష్ట్ర ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు ఐదు రోజుల నుంచి ఈ దాడులు నిర్వ‌హిస్తున్నారు.

అన్ని లావాదేవీల‌ను ప‌రిశీలించిన త‌రువాత ఆ బ్యాంకులో భారీ ఎత్తున నల్లధనం జ‌మ‌ అయిందని గుర్తించారు. ఈ బ్యాంకులో మొత్తం 120 కోట్లకు పైగా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌గ‌దు డిపాజిట్ అయింద‌ని చెప్పారు. ఆ బ్యాంకులో భారీ ఎత్తున జ‌మ‌ చేసిన వారిపై విచారణ జ‌రుపుతున్న‌ట్లు తెలిపారు. త‌‌నిఖీలు ఇంకా కొన‌సాగుతున్నాయ‌ని చెప్పారు. బ్యాంకు అధికారుల పాత్రపై ఆరా తీస్తున్న‌ట్లు చెప్పారు. పెద్దనోట్ల రద్దు అనంతరం యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంకుల్లో ఇదే విధంగా భారీగా నగదు జమ అయినట్లు ఇటీవలే అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.

More Telugu News