chennai airport: అప్పట్లో విమర్శలు ఎదుర్కున్న అద్దాలే ఇప్పుడు చెన్నయ్ ఎయిర్ పోర్టుని కాపాడాయట!

ఇటీవ‌ల సంభ‌వించిన వార్ధా తుపాను చెన్నైయ్ న‌గ‌రంలో బీభ‌త్సం సృష్టించిన విష‌యం తెలిసిందే. అయితే చెన్న‌య్ ఎయిర్‌పోర్టు మాత్రం చెక్కుచెద‌రకుండా ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా అలాగే ఉంది. అందుకు కారణం ఆ ఎయిర్‌పోర్టులో ఉన్న‌ అద్దాలే అని ఆ విమానాశ్రయ డైరెక్టర్ జి. చంద్ర మౌళి చెప్పారు. 30 మీటర్ల ఎత్తు, 250 మీటర్ల పొడవుతో ఈ 22 వేల గ్లాస్ ప్యానెల్స్ ను అక్క‌డ నిర్మించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇందుకు వాడిన మెటీరియల్ చాలా నాణ్యమైనదని అందుకే అన్ని ప‌రిస్థితుల‌ను త‌ట్టుకొని నిల్చున్నాయని చెప్పారు.

అయితే, ఇవే అద్దాలపై గ‌తంలో కొంద‌రు ఎన్నో విమర్శలు చేశారు. ఇవి ఎంతో బలహీనంగా ఉన్నాయని, పగిలిపోతున్నాయని అన్నారు. ఈ అద్దాల సున్నిత‌త్వంపై మద్రాస్‌ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టీమ్‌ అధ్యయనం కూడా చేసి ఆ అద్దాలు పగిలిపోవడానికి కారణం నికెల్ సల్ఫైడ్ అని చెప్పింది. భ‌విష్య‌త్తులో మెల్లగా దృఢంగా త‌యార‌వుతాయ‌ని, ప‌గిలే తీవ్రత తగ్గుతుందని చెప్పింది.

More Telugu News