: మళ్లీ వచ్చే సమావేశాల్లో కలుద్దాం.. రాజ్యసభ నిరవధిక వాయిదా

చివ‌రిరోజు కూడా రాజ్య‌స‌భలో పెద్ద‌నోట్ల ర‌ద్దుపై గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో రాజ్య‌స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు ఛైర్మ‌న్‌ హమీద్ అన్సారీ ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా శీతాకాల స‌మావేశాలు జరిగిన తీరుపై స్పందించిన హ‌మీద్ అన్సారీ రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన ఆందోళ‌న‌, గందరగోళం నేప‌థ్యంలో, స‌భ్యులు ఓసారి చ‌ర్చ‌లు జ‌రిగిన తీరుని గురించి తమను తాము ప్రశ్నించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. అనంతరం మీడియాతో కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు మాట్లాడుతూ.. ప్ర‌భుత్వ ప‌క్షం న‌ల్ల‌ధ‌న నిరోధానికి పోరాడుతుంటే, విప‌క్ష‌నేత‌లు మాత్రం అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నార‌ని ఆరోపించారు. మ‌రోవైపు వాయిదా త‌రువాత 12 గంట‌ల‌కు లోక్‌స‌భ ప్రారంభ‌మైంది.

More Telugu News