: ఆ చర్చిలో చిన్ననోట్లు తీసుకోవచ్చు.. తర్వాత తిరిగి ఇవ్వచ్చు!

కేరళలోని కొచ్చి ప్రాంతంలో ఉన్న చర్చికి వెళ్తే భక్తులకు చిన్ననోట్లు అందుతాయి. ఎందుకంటే, పెద్దనోట్ల రద్దుతో ‘చిల్లర’ కోసం అక్కడికి వచ్చే భక్తులు పడుతున్న అవస్థలను గమనించిన చర్చి ఫాదర్ ఈ ఏర్పాటు చేశారు. ఇక్కడి చర్చికి వచ్చే రెండు వందల కుటుంబాలు చిల్లర కోసం ఇబ్బందులు పడుతున్నాయని, వారిలో కొంత మందికి బ్యాంక్ కు వెళ్లడం, పెద్దనోట్లను మార్చుకోవడం తెలియదని అన్నారు. అందుకనే, ఆదివారం రోజున ప్రార్థనలకు వచ్చే భక్తుల కోసం ఈ ఏర్పాటు చేశామన్నారు. ప్రార్థనల అనంతరం రెండు బాక్సులలో రూ.50, రూ.100 నోట్లను ఉంచుతామని చెప్పారు. ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చని, దీని గురించి తామేమీ పట్టించుకోమని అన్నారు. చిన్ననోట్లు తీసుకున్నవారు వారి వద్ద ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు తిరిగి బాక్సుల్లో వేసే సౌకర్యం కల్పించామమన్నారు.

More Telugu News