: పాకిస్తాన్ 'హోదా'పై కేంద్ర ప్రభుత్వ సమావేశం వాయిదా

పాకిస్థాన్ కు భారత్ ఇచ్చిన అత్యంత సానుకూల దేశం హోదా గుర్తింపుపై గురువారం జరగాల్సిన సమీక్షా సమావేశం వాయిదా పడింది. ఇటీవలి ఉరీ దాడిలో 18 మంది జవాన్లను పాక్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు గతంలో ఇచ్చిన ఈ హోదాను రద్దు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం సమావేశం జరగాల్సి ఉంది. అయితే, ఇది అనుకోకుండా వచ్చే వారానికి వాయిదా పడినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ కు మన దేశం అత్యంత సానుకూల దేశం హోదాను ఇచ్చినప్పటికీ ఆ దేశం మనకు ఆ హోదాను కట్టబట్టలేదు. ఈ నేపథ్యంలో భారత్ కు సమాంతరంగా ఈ హోదాను ఇవ్వని పాకిస్తాన్ ను ప్రపంచ వాణిజ్య వేదిక (డబ్ల్యూటీవో) ముందు నిలబెట్టాలనే అంశం చర్చకు రావచ్చని తెలుస్తోంది. డబ్ల్యూటీవో నిబంధనల మేరకు సభ్య దేశాల్లో ఓ దేశం మరో దేశానికి ఈ హోదానిస్తే, రెండో దేశం కూడా అదే పని చేయాల్సి ఉంటుంది. 1996లో కేంద్రం పాకిస్తాన్ కు ఈ హోదాను ప్రకటించగా.... పాకిస్తాన్ 2012లోపు ఈ హోదాను ఇవ్వాల్సి ఉంది. గడువు లోపు ఆ పనిచేయనందున గతంలో మనమిచ్చిన హోదాను వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News