ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఒబామాపై చిత్రీకరించిన షార్ట్ ఫిల్మ్ లో మోదీ!

Thu, Jul 28, 2016, 02:11 PM
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సాధించిన ఘనతలపై రూపొందించిన ఒక షార్ట్ ఫిల్మ్ ను
డెమొక్రాటిక్ పార్టీ కన్వెన్షన్ లో భాగంగా నిన్న చిత్రీకరించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఒబామా కలిసి ఉన్న ఒక ఫొటోను ఐదు నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్ లో వాడుకున్నారు. ఇది ప్రధాని మోదీకి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ షార్ట్ ఫిల్మ్ లో కనిపించిన ఏకైక విదేశీ నేత మోదీయే!

మోదీ కాకుండా బయటి వ్యక్తుల్లో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ బాన్ కీమూన్ కూడా కనిపించనున్నారు. ఒబామా పాలనలో సాధించిన విజయాలను ఈ షార్ట్ ఫిల్మ్ లో ప్రముఖంగా వివరించనున్నారు. ఒబామా పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం నుంచి అల్ ఖైదా చీఫ్ లాడెన్ ను హతమార్చడం వరకు ఉన్న ఎన్నో విషయాలతో పాటు, క్రిస్మస్ క్యారల్స్ పాడిన ఒబామా ఈ షార్ట్ ఫిల్మ్ లో కనిపించనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Articles (Latest)
Articles (Education)