ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమిళం నేర్చుకుంటున్న హైదరాబాదీ హీరోయిన్

Tue, Jul 19, 2016, 04:24 PM
Related Image హైదరాబాదీ హీరోయిన్ అదితి రావు హైదరి ప్రస్తుతం తమిళభాష నేర్చుకునే పనిలో బిజీగా ఉంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక చిత్రంలో అదితిరావు నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తమిళ భాష నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఆ చిత్ర యూనిట్ కు చెందిన ఒక సభ్యుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘అదితి చక్కగా తమిళం మాట్లాడేందుకు గాను గడచిన నెల రోజులుగా ఆమెకు గైడెన్స్ ఇస్తున్నాం. చెన్నైలో మణి సార్ ఆమెకు పాఠాలు చెబుతున్నారు. తమిళ పదాలను ఎలా ఉచ్చరించాలి, సందర్భాన్ని బట్టి ఏ స్థాయిలో ఆయా పదాలను పలకాలనే విషయాలను చెబుతున్నారు. ఈ చిత్రంలో ఆమె పాత్రకున్న ప్రాముఖ్యత దృష్ట్యానే మణి సార్ ఇంత కేర్ తీసుకుంటున్నారు’ అని చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Articles (Latest)
Articles (Education)