: అనిల్ కుంబ్లేకు క్షమాపణలు చెప్పిన బ్రిటీష్ ఎయిర్ వేస్

వెస్టిండీస్ పర్యటన నిమిత్తం భారత జట్టుతో పాటు బయలుదేరిన కోచ్ అనిల్ కుంబ్లే ప్రయాణం ముందుగా అనుకున్నంత సాఫీగా సాగలేదు. వెస్టిండీస్ లోని సెయింట్ కిట్స్ కు వీరు బయలుదేరగా, మధ్యలో గాత్విక్ ఎయిర్ పోర్టులో స్వల్ప విరామం కోసం ఆగిన వేళ, బ్రిటీష్ ఎయిర్ వేస్ సిబ్బంది కుంబ్లే బ్యాగులను అక్కడే వదిలేశారు. దీంతో అనిల్ కుంబ్లే కిట్ బ్యాగ్, దుస్తులు తదితరాలన్నీ గాత్విక్ లో ఉండిపోగా, ఆయన మాత్రం జట్టుతో కలిసి సెయింట్ కిట్స్ కు చేరుకున్నారు. ఆపై తన లగేజీ కోసం ఫిర్యాదు చేయగా బ్రిటీష్ ఎయిర్ వేస్ స్పందించింది. "జరిగిన తప్పుకు క్షమించండి. మీ బ్యాగ్స్ సెయింట్ కిట్స్ కు చేరలేదు. ఇవి గాత్విక్ లో ఉండిపోయాయి. మీ సామాన్లు మీకు సాధ్యమైనంత త్వరగా అందిస్తాం" అని ట్వీట్ చేసింది. కాగా, గతంలోనూ బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానాలపై పలు ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. ఓమారు సచిన్ టెండూల్కర్ సైతం సిబ్బంది సేవలు బాగాలేవని, వారి 'డోంట్ కేర్' దృక్పథం తనకు నచ్చలేదని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, సచిన్ లా అనిల్ కుంబ్లే ఎలాంటి విమర్శనాత్మక వ్యాఖ్యలూ చేయలేదు.

More Telugu News