: సెన్సెక్స్ 1000 పాయింట్లు పడింది... రూ'పోయింది'!

బ్రెగ్జిట్ ప్రభావాన్ని తోసిరాజని గురువారం నాడు మంచి లాభాలను నమోదు చేసిన భారత స్టాక్ మార్కెట్, నేడు పాతాళానికి కూరుకుపోయింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ. 68ని దాటింది. ఇది నాలుగు నెలల కనిష్ఠ స్థాయి. ప్రస్తుతం రూపాయి విలువ 68.85 వద్ద ఉండగా, ఇది మరింతగా పడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదయం 10:32 గంటల సమయంలో సెన్సెక్స్ 1000 పాయింట్లు దిగజారింది. ఆపై స్వల్పంగా తేరుకుని ప్రస్తుతం 970 పాయింట్ల నష్టంలో ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 3.5 శాతానికి పైగా నష్టం. నిఫ్టీ సూచిక 3.6 శాతం దిగజారి 300 పాయింట్లకు పైగా పడిపోయి 7,969 పాయింట్ల వద్దకు చేరింది. నిఫ్టీ-50లోని అన్ని కంపెనీలూ నష్టాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా టాటా గ్రూప్ లోని కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి. టాటా మోటార్స్ ఏకంగా 10 శాతానికి పైగా నష్టపోయింది. బ్రిటన్ లో ఆ సంస్థ అధీనంలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇబ్బందుల్లో పడుతుందన్న విశ్లేషణలే ఇందుకు కారణం. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీలు ఒత్తిడిలో ఉన్నాయి.

More Telugu News