: 100 మీటర్ల ఎత్తులో పైకి లేస్తున్న ఇసుక.. చైనాలో ఇసుక తుపానుతో వణికిపోతోన్న ప్రజలు

చైనాలోని కస్గర్, టంగ్జంక్, మిన్ ఫెంగ్, కౌంటీ నగర ప్రజలు భయంకర ఇసుక తుపానును ఎదుర్కుంటున్నారు. 100 మీటర్ల ఎత్తులో పైకి లేస్తూ వీస్తోన్న ఇసుక తుపాను ధాటికి అక్కడి ఇళ్లన్నీ ఇసుకతో కప్పేసి కనిపిస్తున్నాయి. ఇసుక తుపాను సృష్టిస్తోన్న బీభ‌త్సం ప‌ట్ల అక్క‌డి అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. న‌గ‌రంలో రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ చేశారు. ఇసుక కెర‌టాల ధాటికి అక్క‌డ జ‌న‌జీవ‌నం అస్త‌వ్యస్తమైంది. కస్గర్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌ని బ‌య‌ట‌కు రావ‌ద్దంటూ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు ఆదేశిస్తున్నారు. ఇసుక‌ తుపాను సృష్టిస్తోన్న న‌ష్టాల‌పై చైనా ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటోంది.

More Telugu News