: 114.59 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన హిట్లర్ విగ్రహం

ప్రపంచాన్ని తన కబంధ హస్తాల్లో బంధించాలని భావించిన జర్మనీ నియంత అడాల్ప్ హిట్లర్ విగ్రహం రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ప్రముఖ ఇటాలియన్ చిత్రకారుడు మారిజియో క్యాటెలాన్ తయారు చేసిన ఈ బొమ్మను న్యూయార్క్ మ్యూజియం వేలం వేసింది. వ్యాక్స్, రెగ్జిన్ తో తయారు చేసిన ఈ విగ్రహం గతంలో 7.9 మిలియన్ల ధర లభించగా, ఈసారి వేలంలో 10 నుంచి 15 మిలియన్ డాలర్ల వరకు ధర పలకవచ్చని మ్యూజియం అధికారులు భావించారు. అయితే వారి అంచనాలను తల్లకిందులు చేస్తూ 17.5 మిలియన్ డాలర్ల (114.59 కోట్ల రూపాయలు) ధర పలికిందని వారు వెల్లడించారు. దీనితో పాటు వేలానికి ఉంచిన జెఫ్ కూన్స్ తయారు చేసిన వన్ బాల్ టోటల్ ఈక్విలిబ్రియమ్ ట్యాంక్ 15.3 మిలియన్ డాలర్ల (101.92 కోట్ల రూపాయలు) ధర పలికింది. కాగా, బాండ్ ఫెయిల్ పేరిట మొత్తం 39 వస్తువులను మ్యూజియం అధికారులు వేలానికి ఉంచారు. ఆదివారం మొదలైన ఈ వేలం గురువారం వరకు సాగనుంది. ఇప్పటి వరకు విక్రయించిన విగ్రహాలకు 78.1 మిలియన్ డాలర్ల (520 కోట్ల రూపాయలు) సొమ్ము సమకూరిందని వారు తెలిపారు.

More Telugu News