: అంతా మన అసమర్థతే... భారత్, చైనాలపై కోపం లేదు: మాటమార్చిన ట్రంప్

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీ పడేది తానేనని దాదాపుగా స్పష్టమైపోయిన తరువాత డొనాల్డ్ ట్రంప్ వైఖరి కొంత మారినట్టు కనిపిస్తోంది. ఇండియానాలో ప్రైమరీ ఎన్నికలు జరగనున్న వేళ, ట్రంప్ నోటివెంట సాఫ్ట్ గా మాటలు రాగా, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. తనకు ఇండియా, చైనా, జపాన్ తదితర దేశాలపై ఎలాంటి కోపమూ లేదని చెప్పిన ట్రంప్, అమెరికా నేతల అసమర్థత వల్లనే ఇక్కడి నిరుద్యోగులకు దక్కాల్సిన ఉద్యోగాలు విదేశీయులకు దక్కుతున్నాయని అన్నారు. ఒబామా ఆర్థిక విధానాలపై నిప్పులు చెరిగిన ఆయన, తాను అధ్యక్షుడినైతే, వీసాల జారీలో సంస్కరణలు తీసుకువస్తానని, ఇక్కడ పనిచేస్తున్న ఏ విదేశీయుడికీ తాను వ్యతిరేకం కాదని అన్నారు. ఎప్పుడూ నోరు పారేసుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్రంప్ నోటివెంట ఈ తరహా మాటలు వస్తుంటే, ఇండియానా ప్రజలు చప్పట్లతో మద్దతు పలికారు.

More Telugu News