: ఇకపై మీ మాతృభాషలోనే మీ కథ చెప్పుకోండి!

నెటిజన్లు తమ స్టోరీలను నలుగురితో పంచుకునే సేవలందిస్తున్న 'యువర్ స్టోరీ' ఇకపై ఆరు భారతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది. 2008లో శ్రద్ధాశర్మ ప్రారంభించిన 'యువర్ స్టోరీ' ఇప్పటికే 15 వేల మంది ఔత్సాహికవేత్తలకు, అంతకు ఎన్నో రెట్ల మంది నెటిజన్లకు వేదికైంది. ఇప్పుడు తాజాగా, హిందీ, కన్నడ, తెలుగు, బెంగాలీ, తమిళం, మరాఠీ భాషల్లో ప్రొఫైల్ పేజీలు పంచుకోవచ్చని శ్రద్ధా శర్మ వివరించారు. వీటితో పాటు వచ్చే రెండు నెలల వ్యవధిలో గుజరాతీ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, పంజాబీ, ఒరియా భాషల్లో సేవలను ప్రారంభిస్తామని తెలిపారు. "కొన్ని కోట్ల కథలను పంచుకునేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారు. వారికి కావాల్సిన వేదికను మేం అందిస్తున్నాం. వేలాదిమందికి స్ఫూర్తి నిచ్చేలా ఎందరి కథలో 'యువర్ స్టోరీ' పైకి వస్తాయని భావిస్తున్నాం" అని ఆమె అన్నారు. 10 కోట్ల మంది ప్రజల కథలను నలుగురికీ అందించడమే తమ లక్ష్యమని అన్నారు.

More Telugu News