: సెటిలర్స్ అనడం మమ్మల్ని బాధిస్తోంది: డిప్యూటీ సీఎం కేఈ

హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ ప్రజలను సెటిలర్స్ అంటూ కించపరుస్తున్నారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. అలా అనడం తమను తీవ్రంగా బాధిస్తోందని చెప్పారు. సెక్షన్-8, ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ మధ్యాహ్నం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ముఖర్జీని ఏపీ మంత్రులు కేఈ, అచ్చెన్నాయుడు, బొజ్జల గోపాలకృష్ణమూర్తి, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు కలిశారు. ఏపీలో ప్రస్తుత పరిణామాలు, ఇతర అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ పై తమ వద్ద ఆధారాలున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రెండు రాష్ట్రాల వివాదాల పరిష్కారానికి గవర్నర్ కృషి చేయాలని కోరారు. హైదరాబాద్ లో ఏపీ కార్మిక శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

More Telugu News