మామళ్లపురమే మహాబలిపురం

ఒక వైపున చరిత్ర .. మరో వైపున ఆధ్యాత్మికత పెనవేసుకుపోయి కనిపించే ప్రదేశమే 'మహాబలిపురం'. ఇక్కడి చరిత్రను ప్రకృతి అందాల మధ్య దర్శించడం .. ఇక్కడి ఆధ్యాత్మికతను ప్రకృతి అందాల నడుమ స్పర్శించడం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ క్షేత్రానికి 'మహాబలిపురం' అనే పేరు రావడానికి గల కారణంగా ఇక్కడ అనేక కథలు .. గాథలు వినిపిస్తుంటాయి.

'మహాబలి' అనే రాజు పరిపాలించిన ప్రదేశం కావడం వలన, 'మహాబలిపురం' అనే పేరు వచ్చిందని అంటారు. ఇక పల్లవ రాజులలో ప్రముఖుడిగా చెప్పబడే నరసింహవర్మకు, 'పల్లవ మల్ల' అనే బిరుదు వుండేది. చాళుక్యరాజు .. పులకేశిని ఓడించడం వలన నరసింహవర్మకి ఈ బిరుదు వచ్చింది. ఆయన ఇక్కడ ఎన్నో అద్భుతమైన కట్టడాలను నిర్మింపజేశాడు. అందువలన ఆ ప్రదేశాన్ని 'మా మల్ల పురం' అని పిలుచుకునేవారట. అది కాలక్రమంలో 'మామళ్ల పురం'గా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత కాలంలో 'మహాబలిపురం'గా పిలవబడుతోంది.  


More Bhakti News