: వేర్పాటు వాదుల గృహ నిర్బంధం

కాశ్మీర్లో అల్లర్లు చెలరేగకుండా ముందస్తుగా పోలీసులు వేర్పాటువాద నేతలు మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్, యాసిన్ మాలిక్, సయ్యద్ గిలానీ తదితరులను గృహ నిర్బంధం చేశారు. బాండీపుర జిల్లా, మార్కుండల్ గ్రామంలో సైనికుల కాల్పులకు ఇద్దరు యువకులు మరణించడంతో వేర్పాటు వాద నేతలు అక్కడకు ర్యాలీగా వెళ్లాలని తలపెట్టారు. దీనివల్ల ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగే ప్రమాదముందని భావించిన పోలీసులు ర్యాలీ జరపకుండా ఈ నేతలను నిర్బంధించారు.

More Telugu News