: తేనీరుతో బీపీ దూరం!
ఉదయాన్నే చక్కగా వేడి వేడి తేనీటితో తమ పనులు ప్రారంభించే వాళ్లు చాలామందే ఉన్నారు. కొందరు చక్కగా కాఫీతో తమ ఉదయపు కార్యక్రమాలను ప్రారంభించేవారు కూడా ఉన్నారు. అయితే ఇలా కాఫీ, టీలు తాగేవారికి బీపీ వచ్చే అవకాశం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఫ్రాన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు టీ ఎక్కువగా తాగేవారిలో.. తక్కువ తాగేవారిలో కంటే బీపీ, నాడి, హార్ట్‌రేట్ తక్కువగా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ప్రతిరోజూ నాలుగు కప్పుల టీ లేదా కాఫీ తీసుకునేవారికి అసలు ఏమీ తాగని వారికంటే బీపీ తక్కువగా ఉందని తాము నిర్వహించిన పదేళ్ల అధ్యయనంలో గుర్తించినట్టు ఈ అధ్యయనకర్తలు డైలీఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఈ శాస్త్రవేత్తలు 16 నుండి 95 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 1,76,437 మంది స్త్రీ, పురుషులపై అధ్యయనం నిర్వహించి ఈ ఫలితాలను వెల్లడించారు. తేనీరులో ఉండే కొన్ని రకాలైన పదార్ధాలు మన రక్తనాళాలపై ప్రభావాన్ని చూపడంవల్ల ఇలా బీపీ తక్కువగా ఉండడానికి కారణమవుతోందని ముఖ్య అధ్యయన కర్త బ్రూనో పన్నియెర్ చెబుతున్నారు.