: పరిశీలనలో వివాదాస్పదమైన జెట్-ఎతిహాద్ ఒప్పందం
వివాదాస్పదమైన జెట్-ఎతిహాద్ ఒప్పందం పరిశీలనలో ఉందని ప్రధాని కార్యాలయం స్పష్టతనిచ్చింది. అయితే ఈ ఒప్పందంపై తలెత్తిన సందేహాలపై వివరణకు సంబంధిత మంత్రిత్వ శాఖలకు ఫైళ్లు పంపామని పీఎంవో తెలిపింది. ఒప్పందం విషయంలో ప్రభుత్వంలో ఎలాంటి విభేదాలు లేవని పీఎంవో స్పష్టం చేసింది. ఈ ఒప్పందంపై తొలుత సీపీఎం ఎంపీ సీతారం ఏచూరి అధ్యక్షతన ఉన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఆ తరువాత ఎంపీలు జస్వంత్ సింగ్, దినేష్ త్రివేదీలు అభ్యంతరాలు తెలిపారు. జనతా పార్టీ చీఫ్ సుబ్రహ్మణ్యస్వామి ప్రధానికి పలు లేఖాస్త్రాలు సంధించారు. వాటినన్నింటినీ ప్రక్కనబెట్టి పీఎంవో విభేదాలు లేవని ప్రకటించడం విశేషం.