: జార్ఖాండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు చరమగీతం

జార్ఖాండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఈ నెల 18 తో ముగియనుంది. ఈ నేపధ్యంలో జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు ప్రారంభించాయి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ షకీల్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ హరిప్రసాద్, జేపీసీసీ అధ్యక్షుడు భగత్, సీఎల్పీ లీడర్ ఆర్పీసింగ్ లు జేఎంఎం అదినేత శిబుసోరేన్, ఆయన కుమారుడు హేమంత్ సోరేన్ లను చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని జేఎంఎం ప్రధానకార్యదర్శి భట్టాచార్య ధ్రువీకరించారు. అయితే కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై తమ నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేస్తున్నామని జేఎంఎం నేతలు తెలిపారు. గతంలో జేఎంఎం పార్టీ అలయన్స్ తో పలు దఫాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కానీ, అవేవీ దీర్ఘ కాలం మనలేకపోయాయి. దీంతో జార్ఖాండ్ లో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది.

More Telugu News