: తీరు మార్చుకోని అంజలి... కోర్టు ఆగ్రహం!
దక్షిణాది హీరోయిన్ అంజలి మరోసారి కోర్టుకు గైర్హాజరైంది. తన పిన్ని వేధిస్తోందంటూ, అంజలి కొద్దినెలల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళగా.. తన దత్తపుత్రిక కనిపించడం లేదంటూ, ఆమె పిన్ని భారతీదేవి మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రిట్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం అంజలి హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 9లోపు కోర్టు ఎదుట హాజరుకాకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. దర్శకుడు కలంజియం దాఖలు చేసిన పరువునష్టం దావా విచారణకు కూడా అంజలి హాజరుకాలేదు.