: నాలుగు ట్రక్కుల్లో వేలకోట్ల నగదు పట్టివేత
ముంబయిలో ఐటీ శాఖ అధికారులు నేడు వేల కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. హవాలా సొమ్ముగా భావిస్తున్న రూ.2,500 కోట్ల నగదును, బంగారు ఆభరణాలను 150 సూట్ కేసుల్లో నాలుగు ట్రక్కుల ద్వారా రవాణా చేస్తుండగా ఐటీ శాఖ, ఎన్ఐఏ విభాగం అధికారులు వలపన్ని పట్టుకున్నారు. గుజరాత్ తరలించే క్రమంలో ఈ నగదు పట్టివేతకు గురైంది. ఈ వ్యవహారంలో 50 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఇంత భారీ స్థాయిలో నగదు పట్టుబడడంతో ఈ హవాలా రాకెట్ వెనుక ఎవరైనా ప్రముఖులు ఉన్నారా? అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.