: 'మహీంద్రా' నుంచి మరో కొత్త బైకు
ఆటోమొబైల్ దిగ్గజం 'మహీంద్రా' ఇటీవలే టూ వీలర్స్ సెగ్మెంట్లో కాలుమోపిన సంగతి తెలిసిందే. 'పాంటెరో' పేరుతో ఓ బైక్ ను విడుదల చేసిన మహీంద్రా తాజాగా 100-110 సీసీ విభాగంపై దృష్టి సారించింది. మధ్యతరగతి వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన కొత్త బైక్ 'సెంచురో'ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. జైపూర్లో నేడు జరిగిన ఓ కార్యక్రమంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తమ నూతన ఉత్పత్తిని ఆవిష్కరించారు. దీని ధర రూ.45,000 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించారు. ఈ బైక్ లీటర్ కు 85.4 కిలోమీటర్ల మైలేజి ఇస్తుందని తెలిపారు.