: న్యూజిలాండ్ లో భారత విద్యార్ధి మిస్
న్యూజిలాండ్ లో ఉన్నత విద్య కోసం వచ్చిన అంకుర్ శర్మ గత నెల 9 వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆ దేశ నేరపరిశోధన సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతను విద్యార్ధి వీసా మీద న్యూజిలాండ్ వచ్చాడని, ఇతని వీసా వచ్చే ఏడాది మార్చి వరకూ కాలపరిమితి కలిగి ఉందని తెలిపారు. అంకుర్ శర్మ గురించి మనురీవా ప్రాంతం చుట్టు పక్కల గాలించిన పోలీసులకు అతని ఆచూకీ కనిపించకపోవడంతో, అతని ఆచూకీ ఎవరికి తెలిసినా తమకు తెలియచేయాలని ప్రకటించారు. అయితే అతను ఆక్లాండ్ పరిసర ప్రాంతాల్లో సురక్షితంగా ఉండి ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. అతని ఆచూకీ తెలియని నాటి నుంచి న్యూజిలాండ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వాలు కలవరపడుతున్నాయని, అతను ఏ పరిస్థితుల్లో ఉన్నా తమకు సమాచారం అందించాలని సూచించారు.