: వాసన 'చూసే' కెమెరా!

కెమెరాతో మనం ఏం చేస్తాం... చక్కగా ఫోటోలు తీస్తాం. అయితే వాసనలను గుర్తించగలమా...? గుర్తించలేమనే మనం చెబుతాం. అయితే కొత్తగా వచ్చిన కెమెరా మాత్రం చక్కగా వాసనలను నమోదు చేస్తోంది. పరిశోధకులు అభివృద్ధి చేసిన తాజా కెమెరా సువాసనలను నమోదు చేస్తుంది.

బ్రిటన్‌కు చెందిన డిజైనర్‌ అమీ రాడ్‌క్లిఫ్‌ ఒక కొత్తరకం కెమెరాను రూపొందించారు. ఈ కెమెరాకు మాడెలీన్‌ అనే పేరు పెట్టారు. ఈ కెమెరా ద్వారా సువాసనలను నిల్వ చేసుకోవచ్చని అమీ చెబుతున్నారు. సువాసనలను నిల్వచేసే ఈ కెమెరా ఎలక్ట్రానిక్‌ ముక్కు లాంటిదని చెబుతున్నారు.

More Telugu News