: మండేలా కుటుంబ సభ్యులను కలిసిన ఒబామా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్లీ నేడు జోహాన్నెస్ బర్గ్ లో నెల్సన్ మండేలా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక్కడి నెల్సన్ మండేలా ఫౌండేషన్ సెంటర్ లో వీరి భేటీ జరిగింది. ఈ కేంద్రంలో ఒబామా దంపతులు అర్థగంటపాటు గడిపారు. ఈ సందర్భంగా మండేలా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. 94 ఏళ్ళ మండేలా ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ కారణంగా కొద్దివారాలుగా ప్రిటోరియా క్లినిక్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాస తీసుకుంటున్నారు.