: గుండెజబ్బు రోగులకు శుభవార్త

గుండె జబ్బురోగులకు హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు శుభవార్త చెప్పారు. గుండె జబ్బు రోగులకు బైపాస్ సర్జరీ లేకుండా క్లిష్టమైన యాంజియో ప్లాస్టీని సులభంగా చేయొచ్చని చెబుతున్నారు. రోగి గుండెకు సరఫరా చేసే ముఖ్యమైన ఎడమ దమనికి స్టెంట్ అమర్చడం ద్వారా వ్యాధిని నివారించినట్టు డాక్టర్ రవికుమార్ తెలిపారు. చికిత్స కూడా కేవలం 45 నిమిషాల్లో ముగుస్తుందని, అదనపు సమస్యలేవీ రోగిని చుట్టుముట్టవని అంటున్నారు. రోగి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడని వైద్యులు హామీ ఇస్తున్నారు. అయితే ఈ వైద్యానికి సుమారు 3 లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుందని గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు.

More Telugu News