: ప్రేమించడాన్ని మించిన తలనొప్పి లేదు: బాలీవుడ్ తార నర్గీస్ ఫక్రి
రణ్ బీర్ కపూర్ 'రాక్ స్టార్' సినిమా గుర్తుందా? అందులో హీరోయిన్ నర్గీస్ ఫక్రీ ఆ సినిమా నిర్మాణ సమయంలో రణ్ బీర్ కపూర్ తో ప్రేమాయణం నడింపిందని బాలీవుడ్ కోడైకూసింది. ఇప్పడు తాజాగా ఉదయ్ చోప్రా... నర్గీస్ తో తాను ప్రేమలో ఉన్నట్టు ట్వీట్ చేశాడు. దీనిపై నర్గీస్ ఫక్రీ స్పందిస్తూ తనకు ఉదయ్ గురించి తెలుసని, సరదాగా అలా ట్వీట్ చేసి ఉంటాడని చెప్పింది. అసలు ప్రేమంటేనే పెద్ద తలనొప్పన్న నర్గీస్, జీవితాంతం ఒకే మనిషికి కట్టుబడడం తనకు సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయినా తనకు ఇప్పుడు అంత ఖాళీ లేదని, తన చుట్టూ చాలామంది ఫ్రెండ్స్, బాయ్ ప్రెండ్స్ ఉన్నారని ముక్తాయించింది. తనిక్కడికి డబ్బు సంపాదించడానికి మాత్రమె వచ్చాను తప్పించి పనికిమాలిన పనులు చేసేందుకు కాదని నర్గీస్ ఫక్రీ ఘాటుగా సమాధానమిచ్చింది.