: సోనియాకు కనిమొళి ధన్యవాదాలు
రాజ్యసభ సభ్యురాలిగా మరోసారి ఎన్నికైన డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళి సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఢిల్లీలో సోనియా గాంధీని ఆమె నివాసంలో కనిమొళి ఈ రోజు కలుసుకున్నారు. తాను రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు సహకరించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. దీంతో మళ్లీ డీఎంకే, కాంగ్రెస్ మధ్య స్నేహబంధం చిగురించినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. శ్రీలంక విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరితో విభేదించి మార్చిలో డీఎంకే యూపీఏ సర్కారు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. వాస్తవానికి కనిమొళికి మద్దతివ్వాలని కాంగ్రెస్ భావించలేదని, కరుణానిధి పార్టీ ఎంపీలతో రాయబారం పంపాకే కాంగ్రెస్ కనిమొళికి మద్దతిచ్చిందని సమాచారం.