: నిజం చెప్పిన ముండేకు ఈసీ నోటీస్?

2009 లోక్ సభ ఎన్నికల సందర్భంగా తాను 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశానంటూ వెల్లడించిన బీజేపీ ఎంపీ గోపీనాథ్ ముండేకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. శుక్రవారం ముంబైలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో గోపీనాథ్ తన ఎన్నికల ఖర్చు వివరించారు. దీనిపై కావాలనుకుంటే ఈసీ చర్యలు తీసుకోవచ్చని కూడా అన్నారు. వాస్తవానికి ఎన్నికల నిబంధనల మేరకు లోక్ సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి 40లక్షల రూపాయల వరకే ఖర్చు చేయడానికి పరిమితి ఉంది. మరి దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు చేశానని స్వయంగా గోపీనాథే చెప్పడంతో ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే గోపీనాథ్ ప్రసంగ సీడీలను తెప్పించుకున్నట్లు సమాచారం. వాస్తవానికి ఖర్చు నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే ఎలక్షన్ కమిషన్ గోపీనాథ్ ను అనర్హుడిగా ప్రకటించడమే కాకుండా భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించే అధికారాలను కలిగి ఉంది.

More Telugu News