: మీ సేవ కేంద్రాల్లో ఓటరు కార్డుల సవరణ

ఓటరు గుర్తింపు కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమీపంలోని మీ సేవ కేంద్రానికి వెళితే సరి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీ సేవ కేంద్రాలలో ఓటరు గుర్తింపు కార్డులలో మార్పులు, చేర్పులు చేయించుకోవచ్చని కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ వినోద్ చెప్పారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఉన్న మీ సేవ కేంద్రంలో ఓటరు కార్డుల సవరణను అధికారికంగా ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మట్లాడారు. త్వరలో ఓటరు గుర్తింపు కార్డులను పాన్ కార్డు తరహాలో రూపొందించి జారీ చేయనున్నామని చెప్పారు. దీంతో ప్రస్తుతం పేపర్ లామినేషన్ తో ఉన్న కార్డు ప్లాస్టిక్ కార్డుగా మారిపోనుంది.

More Telugu News