: రూపాయి క్షీణత.. ఎయిర్ హోస్టెస్ కు వరం
పడిపోయిన రూపాయి విలువకు ఓ ప్రైవేటు విమానయాన సంస్థ వింత పరిష్కారం కనుగొంది. విలువ క్షీణించడం కారణంగా పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు మేల్ ఫ్లయిట్ పర్సర్(పురుష సహాయకులు)లకు బదులుగా ఇకపై ఎయిర్ హోస్టెస్ ను మాత్రమే నియమించుకోవాలని నిర్ణయించింది. దీనికి కారణం ప్రతీ ఎయిర్ హోస్టెస్ పురుషులతో పోలిస్తే 20 కేజీల వరకూ తక్కువ బరువు ఉంటున్నారట. మరి బరువు తగ్గించడం కోసమే 'గో ఎయిర్' ఈ నిర్ణయం తీసుకుంది. కారణమేమిటంటే, ఫ్లయిట్ లో ప్రతీ కేజీ బరువుకు గంట ప్రయాణానికి 3 రూపాయలు ఖర్చవుతోంది. ఫ్లయిట్ లో బరువు పెరిగిన కొద్దీ ఇంధనం కూడా అధికంగా ఖర్చవుతోంది. పైగా రూపాయి విలువ క్షీణిస్తోంది. కనుక బరువు ఎంత తక్కువ ఉంటే విమానయాన సంస్థలకు అంత ఖర్చు తగ్గుతుంది.
గో ఎయిర్ లో ప్రస్తుతం క్యాబిన్ క్రూ సిబ్బంది 330 మంది ఉన్నారు. వీరిలో 40 శాతం పురుషులేనట. పురుషుల కంటే మహిళలే బరువు చాలా తక్కువగా ఉంటున్నందున ఇకపై ఎయిర్ హోస్టెస్ నే నియమించుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల గో ఎయిర్ కు ఏటా 3 కోట్ల రూపాయలు ఆదా అవుతాయట. అదీ అసలు విషయం!