: వాడీవేడిగా శ్రీకాళహస్తి దేవాలయాభివృద్ధి సమావేశం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి దేవాలయాభివృద్ధి సమావేశం వాగ్వాదాలతో ప్రారంభమైంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆలయ సందర్శకుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, వసతి గృహాలు, రహదారులు వంటి సమస్యలపై చర్చించారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న స్కిట్ కళాశాల అభివృద్ది పనులు, ఆలయం ఆధ్వర్యంలో పాఠశాల ఏర్పాటు గురించి సీరియస్ గా చర్చించారు. అయితే ఈమధ్యే రాజగోపురం కూలడంతో నిర్వాసితులైన వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు, నష్టపరిహారం చెల్లించడంలో జరుగుతున్న జాప్యంపై అధికారులను నేతలు ప్రశ్నించడంతో కాసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. మరోపక్క సమావేశాలు జరపడమే కానీ అమలు చేసేది ఎప్పుడు? అంటూ స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు.

More Telugu News