: తెలంగాణ వచ్చే దాకా కాంగ్రెస్ పై పోరాడతాం: కోదండరాం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, ఇతర నేతలు బీజేపీ కార్యాలయంలో భేటీ అయి తెలంగాణ అంశంపై చర్చించారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ వచ్చేదాకా కాంగ్రెస్ నేతలపై పోరాడుతామన్నారు. జూలై 4న ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని కోదండరాం తెలిపారు. దీనిలో జాతీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు పాల్గొంటాయని చెప్పారు. ఆ తర్వాత తెలంగాణలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు.

More Telugu News